ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తై, లక్ష్యాన్ని మించి టీకాల కవరేజ్ నమోదైంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సేవలను అభినందించారు.
రాష్ట్రవ్యాప్తంగా 40,97,749 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించగా, మొత్తం 41,53,185 మంది చిన్నారులకు టీకాలు అందించి 101.4 శాతం కవరేజ్ సాధించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ విజయానికి వైద్యులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు సమిష్టిగా కృషి చేశారని కొనియాడారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి సంబంధించిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ, కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

















