ప్రతిపక్షం, జూలై 03: తెలంగాణ రాష్ట్ర అప్పుల వ్యవహారంపై రాజకీయ వాగ్వాదం కొనసాగుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వం మొత్తం రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు పేర్కొన్న భట్టి, వాటిలో బకాయిలు కూడా ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.86 లక్షల కోట్లను బ్యాంకులకు చెల్లించిందని వెల్లడించారు.
ఈ లెక్కలు వాస్తవాలు కాదా అని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి, మిగిలిన అప్పులను ఎవరు చెల్లిస్తారో కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

















