ప్రతిపక్షం, జూలై 04: సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ‘స్థాయి’ అంశంపై వచ్చిన ప్రశ్నకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. గతంలో తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అసెంబ్లీకి ఒక్కరోజు కూడా గైర్హాజరు కాలేదని గుర్తు చేస్తూ, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా ఓ జర్నలిస్టు “కేసీఆర్ స్థాయి, మీ స్థాయి” అంటూ వ్యాఖ్యానించగా భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఏం స్థాయి.. నీ స్థాయి ఏమిటి? కేసీఆర్ అయినా, ఎవరైనా స్థాయి పుట్టుకతో రాదు. చేసే పనితో వస్తుంది” అని ఘాటుగా స్పందించారు.
ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేసే వారికే నిజమైన గౌరవం లభిస్తుందని, పదవులు లేదా వ్యక్తుల ఆధారంగా స్థాయిని కొలవడం సరికాదని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.

















