టీఆర్ఎస్ పార్టీ పేరుపై కవితకు ఈసీ షాక్

ప్రతిపక్షం, జూలై 04: కల్వకుంట్ల కవితకు ఎన్నికల సంఘం (ఈసీ) కీలక షాక్ ఇచ్చింది. ఆమె నమోదు చేయాలనుకున్న టీఆర్ఎస్ (TRS) పార్టీ పేరును మార్చాలని సూచిస్తూ లేఖ పంపింది.

15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పార్టీ పేర్లను సమర్పించాలని, నిర్ణీత గడువులోగా స్పందించకపోతే ఎలాంటి తదుపరి సమాచారం లేకుండానే పార్టీ నమోదు దరఖాస్తును మూసివేస్తామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

టీఆర్ఎస్ పేరుపై ఇప్పటికే బీఆర్ఎస్‌తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈసీ సూచనల మేరకు కవిత ఏ కొత్త పేర్లను ప్రతిపాదిస్తారనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Spread the love

Related News

Latest News