ప్రతిపక్షం, జూలై 04: దేశ ఆర్థికాభివృద్ధిలో మధ్యతరగతి ప్రజలదే కీలక పాత్ర అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భారత అభివృద్ధికి మిడిల్ క్లాస్ ఇంజిన్‌లా పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
2036 నాటికి దేశ వినియోగదారుల మొత్తం ఖర్చుల్లో 96 శాతం వాటా మధ్యతరగతి ప్రజలదేనని వెల్లడించారు. సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాల కల్పన ద్వారా మధ్యతరగతి అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
కొవిడ్ అనంతరం దేశ ఆర్థిక పురోగతి స్థిరంగా కొనసాగుతోందని, వినియోగ వ్యయాన్ని పెంచడం ద్వారా మధ్యతరగతి ప్రజలు ఆర్థిక వ్యవస్థకు ప్రధాన బలంగా నిలిచారని నిర్మలా సీతారామన్ తెలిపారు.
















