ప్రతిపక్షం, జూలై 04: టీఆర్ఎస్ పార్టీ పేరు మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచించడంపై పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ పార్టీ పేరు టీఆర్ఎస్‌గానే కొనసాగుతుందని, కొత్త పేర్లను సూచించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం లేవనెత్తిన రెండు అభ్యంతరాలకు ఇప్పటికే వివరణ ఇచ్చామని పేర్కొన్న కవిత, పార్టీ పేరును మార్చబోమని తేల్చిచెప్పారు. అవసరమైతే ఈ అంశంపై న్యాయపోరాటం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.
















