రూ. 44 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 04: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 39వ డివిజన్ సంతోష్ నగర్ లోని సంతోషిమాత రోడ్ లో మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ. 44 లక్షలతో చేపట్టనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం సంతోష్ నగర్ లోని సంతోషిమాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ తో పాటు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ , బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ,39వ డివిజన్ కార్పొరేటర్ ఎన్నం లక్ష్మి-ప్రకాష్ , బీజేపీ కార్పొరేటర్లు,పార్టీ నాయకులు, బీజేపీ శ్రేణులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News