ప్రతిపక్షం, జూలై 04: హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానంతో భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.
స్థానికుల వివరాల ప్రకారం.. చిలుకానగర్‌కు చెందిన సురేశ్ తన భార్య జెస్సికా (35)పై అనుమానం పెంచుకుని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. 2015లో వివాహం చేసుకున్న వీరికి 10 ఏళ్ల కుమార్తె ఉంది.
హత్య అనంతరం జెస్సికా సోదరికి ఫోన్ చేసి, తానే హత్య చేసినట్లు సురేశ్ చెప్పినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల పూర్తి కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
















