ప్రతిపక్షం, జూలై 04: మిడ్జిల్ మండలం జెడ్పీటీసీగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన ఎ. రేవంత్ రెడ్డి ప్రజాసేవ ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా పలువురు మంత్రులు ఆయనను అభినందించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
రెండు దశాబ్దాల ప్రజా జీవితాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ మంత్రులు అభినందనలు తెలియజేశారు.
















