ప్రతిపక్షం, జూలై 04: హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఐఐఐటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. అభిరూప్ అనే విద్యార్థి భవనం ఆరవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనతో క్యాంపస్‌లో విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్య ఆలోచనలు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి కుటుంబ సభ్యులు, స్నేహితులు, నిపుణుల సహాయం ఎంతో కీలకం అని అధికారులు సూచిస్తున్నారు.

















