టెలిగ్రామ్‌కు కేంద్రం హెచ్చరిక.. పైరసీ కంటెంట్ తొలగించాలంటూ నోటీసులు

ప్రతిపక్షం, జూలై 04: మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నోటీసులు జారీ చేసింది. యాప్‌లో అనుమతి లేకుండా సినిమాలు, ఓటీటీ కంటెంట్, పైరసీ వీడియోలు విస్తృతంగా అందుబాటులో ఉండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పైరసీ కంటెంట్‌ను వెంటనే తొలగించేందుకు తీసుకున్న చర్యలపై 15 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని టెలిగ్రామ్ యాజమాన్యాన్ని ఆదేశించింది.

సినీ పరిశ్రమ, ఓటీటీ సంస్థల కాపీరైట్ హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన కేంద్రం, చట్టవిరుద్ధ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించింది. ఇప్పటికే పైరసీ నియంత్రణపై పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం, డిజిటల్ వేదికల బాధ్యతను మరింత పెంచే దిశగా అడుగులు వేస్తోంది.

Spread the love

Related News

Latest News