దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి

చేర్యాలలో ఘనంగా దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు

ప్రతిపక్షం చేర్యాల, జులై 4: దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కురుమ సంఘం రాష్ట్ర నాయకులు మీస సత్యనారాయణ, అందే అశోక్, ఒగ్గు మల్లేశం లు డిమాండ్ చేశారు. శనివారం చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాడు భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికే భూమి కావాలని 10 లక్షలు ఎకరాల భూములను పేదలకు పంచి 4500 మంది కమ్యూనిస్టులు రక్త తర్పణం చేశారని, ఆ పోరాటంలో రైతుల ధాన్యాన్ని దోచుకొని అరాచకాలు చేస్తున్న దేశ్ ముఖ్ దొరలు, నిజాం రజాకార్లను ఎదురొడ్డి దొరల గడీలను కూల్చిన గొప్ప వీరుడు తెలంగాణ భగత్ సింగ్, చేగువేరా అని కొనియాడారు. ఆ పోరాటంలో ముందు వరుసలో నిలిచిన దొడ్డి కొమురయ్యపై రజాకారులు జరిపిన కాల్పుల్లో నేలకొరిగి తెలంగాణ తొలి అమరుడు గా నిలిచారని గుర్తు చేశారు. ఆయన పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దొడ్డి కొమురయ్య కౌoస్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘం, వివిధ పార్టీల నాయకులు కామల్ల అనిల్, శివగారి అంజయ్య, ఈరి భూమయ్య, యాట భిక్షపతి,బండారి అంజయ్య, సూర్న శ్రీకాంత్, అందె చందు, శెట్టె బాపురాజు, తిగుల్ల కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News