బ్యారేజీల్లో నీళ్లు నింపితే ప్రమాదమే.. బీఆర్ఎస్ డిమాండ్‌పై మంత్రి ఉత్తమ్ కౌంటర్

ప్రతిపక్షం, జూలై 05: కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి బ్యారేజీల్లో నిల్వ చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభిస్తే నీటిని ముందుగా అన్నారం, అనంతరం సుందిళ్ల బ్యారేజీలకు ఎత్తిపోయాల్సి ఉంటుందని తెలిపారు. అయితే ఆ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ) నివేదిక ప్రకారం మూడు బ్యారేజీల బేస్‌మెంట్ బలహీనంగా ఉందని పేర్కొన్న మంత్రి, వాటిలో నీటిని నిల్వ చేస్తే బ్యారేజీలు కూలిపోయే ప్రమాదం ఉందన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే దిగువన ఉన్న సుమారు 44 గ్రామాలు తీవ్ర ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం సరికాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Spread the love

Related News

Latest News