ప్రతిపక్షం, జూలై 06: బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా బాధితురాలి తల్లి తరఫు న్యాయవాది దాఖలు చేసిన కౌంటర్ కాపీ తమకు అందలేదని, వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని భగీరథ్ తరఫు న్యాయవాదులు కోరారు. దీంతో జస్టిస్ కె. సుజనా విచారణను నేటికి వాయిదా వేశారు.
ఈ కేసులో బండి భగీరథ్ ముందుగా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. అనంతరం ఆయన పోలీసుల ఎదుట లొంగిపోయి దర్యాప్తుకు సహకరించారు. ప్రస్తుతం దర్యాప్తు పూర్తవడంతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు. నేటి విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.















