ప్రతిపక్షం, జూలై 06: మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ను వీడనున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా ఆయన తెలంగాణ భవన్కు దూరంగా ఉండటంతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా కనిపించకపోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
తాజాగా ఓ పార్టీ కార్యకర్త జన్మదిన వేడుకలో మాట్లాడుతూ, “నేను బీఆర్ఎస్కు దూరమవుతున్నానని మర్చిపోతున్నారా?” అంటూ మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి. ఆయన వ్యాఖ్యలు సరదాగా చేశారా? లేక రాజకీయ సంకేతమా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, గతంలో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి బీజేపీలో చేరనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చినప్పటికీ వాటిని కుటుంబ సభ్యులు ఖండించారు. ప్రస్తుతం మల్లారెడ్డి భవిష్యత్ రాజకీయ అడుగులపై మళ్లీ చర్చ మొదలైంది. అయితే ఆయన పార్టీ మార్పుపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఆయన రాజకీయ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.















