రేపు నాచారం పర్యటనలో సీఎం రేవంత్.. తెలంగాణ ఫుడ్స్ నూతన ప్లాంట్ ప్రారంభం

ప్రతిపక్షం, జూలై 06: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్‌కు చెందిన నూతన ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించి, ఆ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్, నాణ్యత ప్రమాణాల పెంపు, ప్రభుత్వ పోషకాహార కార్యక్రమాలకు ఈ ప్లాంట్ తోడ్పడనుందని అధికారులు భావిస్తున్నారు.

అనంతరం ఈ నెల 9న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జగన్నాధపురంలో నిర్వహించే రైతు ఆశీర్వాద ముగింపు సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యక్రమాలు, రైతు సంక్షేమ పథకాలపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం.

రాష్ట్రంలో వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు వివరించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రైతులకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించే అవకాశముంది.

Spread the love

Related News

Latest News