ప్రతిపక్షం, జూలై 07: తెలంగాణలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి (83) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. 1978, 1983లో కాంగ్రెస్ పార్టీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 300 ఎకరాల భూమిని పేదలకు దానం చేయడంతో పాటు నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల సమస్యలపై సుదీర్ఘకాలం పోరాటం చేశారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సామాజిక వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి.

















