కడియం శ్రీహరిపై ఏఐసీసీకి కొండా సురేఖ ఫిర్యాదు

ప్రతిపక్షం, జూలై 07: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇటీవల నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించి, ఉమ్మడి వరంగల్‌కు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన కొండా సురేఖ, జిల్లా వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకోవడం సరికాదని మండిపడ్డారు. ఈ విషయంపై ఏఐసీసీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

గతంలోనూ ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నప్పటికీ, ఇటీవల సయోధ్య కుదిరినట్లు కనిపించింది. అయితే తాజా పరిణామాలతో వారి మధ్య విభేదాలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి.

Spread the love

Related News

Latest News