ప్రతిపక్షం, జూలై 07: ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై తోటి విద్యార్థినులు అమానుషంగా ప్రవర్తించారు. బాధితురాలి కళ్లకు గంతలు కట్టి వేధించడంతో పాటు పెన్ క్యాప్‌ను గొంతులో పెట్టి బలవంతంగా నీళ్లు తాగించడంతో అది కడుపులోకి వెళ్లింది.
అస్వస్థతకు గురైన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు శస్త్రచికిత్స చేసి పెన్ క్యాప్‌ను తొలగించారు. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
















