ప్రతిపక్షం, జూలై 07: హైదరాబాద్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ గడువును పొడిగించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. బీఎల్వోలు ఓటర్లకు తగిన అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు.
ఇప్పటివరకు పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాల్లో కేవలం 7 శాతం మాత్రమే తిరిగి సమర్పించబడినట్లు పేర్కొన్న కేటీఆర్, మిగిలిన ప్రక్రియను జులై 24లోపు పూర్తి చేయడం సాధ్యం కాదన్నారు. ఓటర్లకు తగిన సమయం కల్పించేందుకు ఎస్ఐఆర్ గడువును వెంటనే పొడిగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.
















