రెండు కీలక శాసనసభ కమిటీల్లో సభ్యుడిగా వనపర్తి ఎమ్మెల్యే.మేఘారెడ్డి నియామకం

ప్రతిపక్షం, జూలై 07, వనపర్తి ప్రతినిధి: తెలంగాణ శాసనసభ 2026–27 సంవత్సరానికి ప్రకటించిన కమిటీల్లో వనపర్తి ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డికి ఒకేసారి రెండు కీలక శాసనసభ కమిటీలకు సభ్యులుగా నియమితులయ్యారు. తెలంగాణ శాసనసభ విడుదల చేసిన అధికారిక బులెటిన్ ప్రకారం తూడి మేఘారెడ్డి మైనారిటీల సంక్షేమ కమిటీ (Committee on Welfare of Minorities) సభ్యునిగా, అలాగే రూల్స్ కమిటీ (Rules Committee) సభ్యునిగా నియమితులయ్యారు. మైనారిటీల సంక్షేమ కమిటీ అధ్యక్షుడిగా లక్ష్మీ కాంతారావు, సభ్యులుగా మేఘారెడ్డిలు రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించి ప్రభుత్వానికి సూచనలు చేసే బాధ్యతలను నిర్వర్తించనున్నారుఅదేవిధంగా రూల్స్ కమిటీ అధ్యక్షులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,సభ్యుడిగా శాసనసభ్యులు తూడి మేఘారెడ్డిలు నిర్వహణ నియమాలు, విధివిధానాల రూపకల్పన, సవరణలు, సభ నిర్వహణను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే అంశాలపై తన సూచనలు అందించనున్నారు.ఒకేసారి రెండు కీలక కమిటీల్లో సభ్యత్వం లభించడం ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డిపై రాష్ట్ర నాయకత్వం ఉంచిన విశ్వాసానికి నిదర్శనంగా చెప్పవచ్చు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే.తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ…తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ముఖ్యమంత్రి. ఎనుముల రేవంత్ రెడ్డి,శాసనసభ స్పీకర్ కు , పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శాసనసభ కమిటీల్లో చురుకుగా పనిచేసి, రాష్ట్ర అభివృద్ధితో పాటు వనపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలను సమర్థవంతంగా ప్రస్తావిస్తూ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తానని ఆయన తెలిపారు.

Spread the love

Related News

Latest News