హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణంపై విచారణ వేగం

ప్రతిపక్షం, జూలై 07: హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ పూర్తి నీటిమట్టం (ఎఫ్‌టీఎల్) పరిధిలో అక్రమ నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణను ముమ్మరం చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక అల నేతృత్వంలోని సంయుక్త బృందం నిర్మాణ స్థలాన్ని పరిశీలించింది.

ప్రదీప్ కన్‌స్ట్రక్షన్స్ చేపట్టిన నిర్మాణానికి నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు జారీ కాలేదని అధికారులు వెల్లడించారు. అయితే నిర్మాణం చట్టవిరుద్ధమా కాదా అనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.

భూ యాజమాన్య పత్రాలు, నిర్మాణ అనుమతులు, ఎఫ్‌టీఎల్ సరిహద్దులు, ఇతర చట్టపరమైన అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే తుది నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు. చెరువులు, సరస్సుల పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News