ప్రతిపక్షం, జూలై 07: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు హిమాన్షు స్వల్ప గాయాలతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ముక్కుకు గాయం కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
హిమాన్షు ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ నుంచి ఏఐజీ ఆసుపత్రికి బయల్దేరారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఆసుపత్రికి చేరుకుని హిమాన్షును పరామర్శించి, వైద్యులను చికిత్స వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హిమాన్షు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, గాయం స్వల్పమేనని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

















