హుస్సేన్‌సాగర్ చుట్టూ హైడ్రా యాక్షన్.. ఎఫ్‌టీఎల్ ఆక్రమణలపై కఠిన చర్యలకు సిద్ధం

ప్రతిపక్షం, జూలై 08: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సరస్సు పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా (HYDRAA) దృష్టి సారించింది. సరస్సు పూర్తి నీటిమట్టం (FTL) పరిధి, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ కట్టడాలు, వాణిజ్య సముదాయాలపై చట్టపరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు కార్యాచరణ ప్రారంభించారు.

గతంలో నమోదైన ఉల్లంఘనలను తిరిగి పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు, పాత నివేదికలు, గూగుల్ శాటిలైట్ చిత్రాలు, భూ రికార్డుల ఆధారంగా ఆక్రమణలను గుర్తిస్తున్నారు. అనంతరం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సంబంధిత యజమానులకు న్యాయపరమైన నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం.

విచారణలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలితే, చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో చెరువు పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఈ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై ఈసారి కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో సరస్సు పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ నిర్మాణాల యజమానుల్లో ఆందోళన నెలకొంది.

Spread the love

Related News

Latest News