బాలికపై హత్యాచారం.. నిందితుడి ఎన్‌కౌంటర్

ప్రతిపక్షం, జూలై 08: పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు ప్రవాశ్ మోండల్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం, అర్ధరాత్రి ఘటన స్థలంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు పోలీసుల ఆయుధాన్ని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం.

ఇటీవల బరైపూర్ ప్రాంతంలో 11 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి ఎన్‌కౌంటర్ అనంతరం దర్యాప్తును పోలీసులు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. బాధిత కుటుంబానికి మద్దతుగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ర్యాలీ నిర్వహించారు. కేసులో మిగిలిన నిందితులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Spread the love

Related News

Latest News