ఆహార భద్రత చట్టం లోని అంతోదయ కార్డును రద్దు చేసే విధానాన్ని విరమించుకోవాలి: సిఐటియు జిల్లా నాయకులు సంతోష్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 09: కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టంలోని అంతోదయ కార్డును రద్దు చేసే ప్రయత్నం విరమించుకోవాలని. పేద ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సిఐటియు జిల్లా నాయకులు సంతోష్ అన్నారు మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో నిరసన చేయడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు జె సంతోష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే మల్లేశం మాట్లాడుతూ దేశంలో 80 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారని అన్నారు. దేశంలో సుమారుగా 35 కోట్ల మంది అంత్యోదయ కార్డులు ఉన్నాయని అన్నారు .మెదక్ జిల్లాలో 213873 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి ..జిల్లాలో 13,857 అంతదయ్య కార్డులు కలిగి ఉన్నారని అన్నారు. జిల్లాలో సుమారుగా 15000 కుటుంబాలు 35 కిలోల బియ్యాన్ని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అందరికీ అన్నం పెడతామని గొప్పలు చెబుతున్న బిజెపి అంథోదయ కార్డులను రద్దు చేయడం దుర్మార్గం అని అన్నారు .ఆహార భద్రత చట్టం ప్రకారం అందరికీ పేదలకు అన్నం పెట్టాలని చట్టంలో ఉందని అన్నారు .చట్టం ప్రకారం పేదలకు అన్నాం పేట్టే విధానాన్ని పెంచాలని అన్నారు. దేశంలో జనాభా ప్రకారం అందరికీ అన్నం పెట్టే ఆహార భద్రత చుట్టాన్ని సవరించడం న్యాయం కాదని అన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అంతోదయకారులను కొనసాగించాలని పేదలను గుర్తించి కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వికలాంగుల సంఘం జిల్లా నాయకులు కె.కవిత వై దుర్గ రైతు సంగం సిహెచ్ బచ్చా గౌడ్ . రాణి ..అజయ్.. తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News