పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్.. షరతులతో విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతి

ప్రతిపక్షం, జూలై 09: పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన న్యాయస్థానం, శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.

హైకోర్టు ఆదేశాల ప్రకారం, బండి భగీరథ్ రూ.1 లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాల్సి ఉంటుంది. కోర్టు విధించిన ఇతర షరతులను కూడా తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ షరతులు పూర్తి చేసిన అనంతరం ఆయన విడుదలకు మార్గం సుగమం కానుంది.

గతంలో పరీక్షలు రాసేందుకు బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువు ముగియడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లగా, అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన కోర్టు తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, పోక్సో కేసులో బండి భగీరథ్‌ను ఈ ఏడాది మే 16న పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నారు. తాజా హైకోర్టు ఉత్తర్వులతో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ లభించినప్పటికీ, కేసు విచారణ మాత్రం సంబంధిత న్యాయస్థానంలో కొనసాగనుంది.

Spread the love

Related News

Latest News