విద్యార్థి సంఘాల బంద్ ప్రభావం.. కొన్ని పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు

ప్రతిపక్షం, జూలై 10: తెలంగాణలో విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు కారణంగా కొన్ని ప్రైవేటు పాఠశాలలకు వరుసగా మూడు రోజుల సెలవులు రానున్నాయి. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో, దాని ప్రభావం పలు విద్యాసంస్థలపై పడుతోంది.

బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రైవేటు పాఠశాలలు శుక్రవారం తరగతులను నిర్వహించకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సమ్మర్ సెలవులు పొడిగించినందున రెండో శనివారాన్ని వర్కింగ్ డేగా ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది. అయితే కొన్ని పాఠశాలలు యథావిధిగా రెండో శనివారం కూడా సెలవు ఇవ్వాలని నిర్ణయించాయి.

దీంతో శుక్రవారం బంద్, శనివారం సెలవు, ఆదివారం సాధారణ వారాంతపు సెలవు కలిసి ఆయా పాఠశాలల విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. అయితే ఈ నిర్ణయం అన్ని పాఠశాలలకు వర్తించదని, ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కొన్ని విద్యాసంస్థలు శనివారం తరగతులు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పాఠశాల యాజమాన్యాల నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని అనుసరించాలని సూచిస్తున్నారు.

Spread the love

Related News

Latest News