విదేశీ ఉద్యోగ జాబ్ మేళా

  • 1,500 మంది నిరుద్యోగులకు ఉపాధి
  • ఉద్యోగ నియామక పత్రాలను అందజేసిన మంత్రులు పొన్నం, వివేక్

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో ఉత్తర తెలంగాణ,జూలై 10: హుస్నాబాద్‌లోని తిరుమల గార్డెన్‌లో ఉపాధి శిక్షణ శాఖ టామ్‌కాం ఆధ్వర్యంలో విదేశీ ఉద్యోగ మేళా–మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా సీపీ రష్మీ పెరుమాళ్, క్రాంతి వెస్లీ, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మీ, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, టామ్‌కాం ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి భారీ సంఖ్యలో నిరుద్యోగ యువత జాబ్ మేళాకు హాజరైందిటామ్‌కాం జాబ్ మేళాలో సుమారు 1,500 మంది నిరుద్యోగులు నమోదు చేసుకోగా, ఎంపికైన పలువురికి మంత్రులు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, హుస్నాబాద్‌లో రూ.45 కోట్ల వ్యయంతో ఏటీసీ (అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. అక్కడ శిక్షణ పొంది దేశీయ, విదేశీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చన్నారు. గతంలో నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా ఇండిగో, హైదరాబాద్‌తో పాటు జర్మనీ తదితర దేశాల్లో కూడా ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు.
హుస్నాబాద్ అభివృద్ధిలో భాగంగా 250 పడకల ఆసుపత్రి, ఎల్లమ్మ చెరువు పర్యాటక అభివృద్ధి, ఇండస్ట్రియల్ పార్క్, అర్బన్ ఫారెస్ట్ పార్క్ వంటి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. జర్మన్ భాష నేర్చుకునే యువతకు వ్యక్తిగతంగా నెలకు రూ.1,000 స్టైపెండ్ అందించనున్నట్లు ప్రకటించారు. విదేశాల్లో డ్రైవర్‌లు సహా పలు రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయని, హుస్నాబాద్‌కు డ్రైవింగ్ స్కూల్ మంజూరు చేస్తామని తెలిపారు.అలాగే హుస్నాబాద్‌లో జర్మన్ భాషా శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ, శిక్షణ పొందే వారికి స్టైపెండ్‌తో పాటు అల్పాహారం కూడా అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తామని, వ్యవసాయ పనిముట్ల తయారీ వంటి రంగాల్లో శిక్షణ కల్పించి ఎంఎస్‌ఎంఈ పరిధిలో స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలోని పేద ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన శాఖ తరఫున సహకారం అందించాలని మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు.

Spread the love

Related News

Latest News