గోదావరి జలాలను ఆంధ్రాకు మళ్లిస్తున్నారు.. తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: హరీశ్ రావు

ప్రతిపక్షం, జూలై 11: తెలంగాణలో గోదావరి వరద జలాల వినియోగంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. లక్షల క్యూసెక్కుల గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.

సోషల్ మీడియా వేదికగా వీడియోను విడుదల చేసిన హరీశ్ రావు.. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను వినియోగించుకుంటుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం కన్నెపల్లి పంపులను ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ రాజకీయ కక్షతో వాటిని నడపడం లేదని విమర్శించారు.

రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ఫలితంగా తెలంగాణ రైతుల పొలాలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. సాగునీటి కోసం అత్యవసర సమయంలో కూడా గోదావరి నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.

“తెలంగాణ రైతుల కడుపు కొట్టి మన రాష్ట్రానికి చెందిన నీళ్లను ఆంధ్రా పాలు చేస్తున్నారు” అంటూ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వెంటనే కన్నెపల్లి మోటార్లను ప్రారంభించి గోదావరి జలాలను రైతులకు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News