సిట్టింగ్ ఎమ్మెల్యేలు శాశ్వత తోపులు కాదు.. పనితీరు మార్చుకోకపోతే చర్యలు: జగ్గారెడ్డి

ప్రతిపక్షం, జూలై 11: సంగారెడ్డిలో తాను పోటీ చేయనని, అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మలే ఉంటారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తాను మరో నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాన్ని మాత్రం తోసిపుచ్చలేదన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరూ శాశ్వతంగా తోపులు కారని, రాజకీయాల్లో పనితీరే ముఖ్యమని వ్యాఖ్యానించారు. సీఎం, పీసీసీ చీఫ్, రాష్ట్ర ఇన్‌చార్జీ మాత్రమే పార్టీకి మార్గనిర్దేశకులని పేర్కొన్నారు. యాక్టివ్‌గా లేని ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అప్రమత్తం చేస్తున్నారని, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో కూడా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రతికూల సర్వేలు వచ్చాయని గుర్తుచేశారు.

Spread the love

Related News

Latest News