- మంచినీటి సౌకర్యం కల్పించని ప్రభుత్వం
- మెదక్ మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన సిపిఎం ప్రతినిధి బృందం
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 11: మాత శిశు ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. శనివారం మెదక్ మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం ప్రతినిధి బృందం సందర్శించారు సిబ్బంది, పేషంట్స్‌ను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని హాస్పిటలే ఈ విదంగా ఉంటే మండల కేంద్రలలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్స్ ఇంకెలా ఉంటాయో అర్థం అవుతుందని అన్నారు.పేరుకే జిల్లా కేంద్ర హాస్పిటల్ అని సమస్యలతో పెషేంట్స్ అవస్థలు పడుతున్నారని అన్నారు.హాస్పిటల్ పరిసరాలను పరిశీలన చేస్తే హృదయవిధారకంగా ఉన్నదని ఇలాంటి దుస్థితి రాష్ట్రంలో ఎక్కడ ఉండదని అన్నారు. ప్రజల ఆరోగ్యనికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని గొప్పలు చెపుతున్న ముఖ్యమంత్రి మెదక్ మతా శిశు ఆరోగ్య కేంద్రన్ని సందర్శిస్తే సమస్యలు అర్థం అవుతాయాని అన్నారు. జిల్లా కేంద్రంలోని ఈ హాస్పిటల్‌కు ప్రతిరోజు 300 నుండి 400 మంది వస్తున్నారాని కానీ వారికి కనీస అవసరలైన త్రాగు నీరు లేదని, హాస్పిటల్లో అడ్మిట్ అయినా పెషేంట్స్ కు తోడుగా వచ్చే సహాయకులు వరండాలో ఉండాల్సిన దుస్థితి రావడం దురదృష్టకరమణి అన్నారు. సహాయకుల కోసం ఏర్పాటు చేసిన షెడ్ రేకులు ఉడిపోయినయని అన్నారు. వర్షం వస్తే సహాయకులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. సహాయకులకు ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం ప్రభుత్వం బాధ్యత కదా అని అన్నారు. సహాయకులకు మూత్రశాలలు, మరుగుదొడ్లు, స్నానపు గదులు లేవని అరుబయటనే కలకృత్యాలు తీర్చుకోవాల్సి రావడం సిగ్గుచెటని అన్నారు. స్నానపు గదుల్లో వాటర్ ట్యాప్స్ ఉడిపోయి ఉన్నాయని అన్నారు.సహాయకులు స్నానం చేయాలంటే కొంటూరు చెరువుకు వెళ్లాల్సి వస్తుందని అన్నారు. హాస్పిటల్లో మౌళిక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.హాస్పిటల్‌కు వెళ్లాలంటే రాత్రి సమయంలో విద్యుత్ ద్విపాలు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని అన్నారు. హాస్పిటల్ లో పని చేస్తున్న కాంట్రాక్టు,ఔట్ సోర్సింగ్ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి కనీస వేతనాలు అమలు కావడం లేదని, సరిపోను సిబ్బంది లేకపోవడం వలన పని భారం పెరుగుతుందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్న ఉమ్మడి జిల్లాలోని మెదక్ జిల్లా కేంద్రంలోని మతా శిశు ఆరోగ్య కేంద్రం సమస్యలకు నిలయంగా ఉంటే మంత్రికి కన్పించడం లేదా అని ప్రశ్నించారు.మంత్రికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మెదక్ జిల్లా కేంద్రం ఉన్న హాస్పిటల్‌ను సదర్శించాలని అన్నారు.జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ సమస్యలపై జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకువచ్చిన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయకుంటే ఉద్యమం చేస్తామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యం అడివయ్య, జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ మల్లేశం, కె మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు జె సంతోష్, పార్టీ నాయకులు షౌకత్, సావిత్రి,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.




















