తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్ కారిడార్లు.. హైదరాబాద్ నుంచి ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది

ప్రతిపక్షం, జూలై 11: దేశవ్యాప్తంగా ప్రకటించిన ఏడు బులెట్ ట్రైన్ కారిడార్లలో తెలంగాణకు మూడు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల 35 నిమిషాలు, పుణేకు 2 గంటలు, ముంబైకి 2 గంటల 20 నిమిషాలు, విజయవాడకు కేవలం 70 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఐటీ రంగం సంప్రదాయ సాఫ్ట్‌వేర్ సేవలకే పరిమితం కాకుండా కృత్రిమ మేధ (AI) ఆధారిత సాంకేతికతల వైపు వేగంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News