ప్రతిపక్షం, జూలై 11: వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో 15 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాద స్థలంలో మృతదేహాల దృశ్యాలు విషాదాన్ని మిగిల్చాయి. సహాయక బృందాలు ఇప్పటివరకు 21 మందిని సురక్షితంగా రక్షించగా, గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ ఉన్నట్లు తెలుస్తోంది. జయశ్రీ భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన సహాయం కోసం భారత రాయబార కార్యాలయం +84 36 281 7930, +84 91 552 3714 హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది.


















