ప్రతిపక్షం, జూలై 11: షాబాద్‌లో జరిగిన దారుణ హత్యల ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, చేవెళ్ల డీసీపీ యోగేశ్ గౌతమ్‌లతో ఫోన్లో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. నిందితుడు రాజ్‌కుమార్‌ను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడాలంటే నేరస్థులకు భయం కలిగేలా శిక్షలు ఉండాలని పేర్కొంటూ, బాధిత కుటుంబాలకు మహిళా కమిషన్ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.


















