117 సీట్లే లక్ష్యం.. రేవంత్ ఎన్నికల వ్యూహం మొదలైంది: జగ్గారెడ్డి

ప్రతిపక్షం, జూలై 11: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాల్లో విజయం సాధించడమే కాంగ్రెస్ లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించారని చెప్పారు. యాక్టివ్‌గా పనిచేయని ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా అజేయులు కారని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డి, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే సిద్దిపేటలో హరీశ్ రావుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.

Spread the love

Related News

Latest News