ఇందిరమ్మ క్యాంటీన్లపై యువకుడి ప్రశంసలు.. ‘మీ చిరునవ్వే నాకు ఆనందం’ : సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 11: ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఆకలి తీరుతోందంటూ ఓ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఆకలి తీర్చారని ఆ యువకుడు చెప్పిన మాటలు తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతోనే ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామని తెలిపారు. ప్రజల కడుపు నిండడం, వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే తనకు అన్నగా లభించే గొప్ప ఆనందమని సీఎం సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.

Spread the love

Related News

Latest News