సన్ షైన్ హైస్కూల్లో ఎన్నికల కోలాహలం

  • విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుండాలి.
  • విద్యార్థులు భవిష్యత్తులో మంచి నాయకత్వ లక్షణాలు ఎంచుకోవాలి.

ప్రతి పక్షం చండూరు జులై 11: చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని సన్ షైన్ హై స్కూల్ నందు స్కూల్ పీపుల్ లీడర్ ఎలక్షన్స్ లో భాగంగా అమ్మాయిల తరఫున పోటీ చేసిన టీ.సిరి, ఎన్.మధు శ్రీ, పి.సుష్మా స్వరాక్షి, డి. అక్షిత అబ్బాయిల తరఫున సి.హెచ్.జగదీష్, బి.భవాని శంకర్, కె.మణివర్మ, బి.జోయల్ పోటీ చేయడం జరిగింది. వీరి నుండి స్కూల్ పీపుల్ లీడర్ గర్ల్, స్కూల్ పీపుల్ లీడర్ బాయ్ లను ఎన్నుకోవడం కొరకు పాఠశాల విద్యార్థులందరికీ ఎన్నికలు జరిగే విధానాన్ని అవగాహన కల్పించడం కోసం స్థానిక సంస్థలలో బ్యాలెట్ పేపర్ తో జరిగే ఎన్నికల మాదిరిగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేక గుర్తును కేటాయించి ప్రచార నిర్వహణకు కొంత సమయాన్ని కేటాయించి ప్రచారం చేసుకున్న తర్వాత నమూనా ఎన్నికల విధానంలో ఎన్నికలను నిర్వహించి స్కూల్ పీపుల్ లీడర్ గర్ల్ గా పి సుష్మా స్వరాక్షి మరియు స్కూల్ పీపుల్ లీడర్ బాయ్ గా కె.మనీ వర్మ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎన్నుకోబడిన విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులను చదువుతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి కొరకు తమ వంతు సలహాలు సూచనలు చేస్తూ క్రమశిక్షణకు మారుపేరుగా సన్ షైన్ విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ కోడి వెంకన్న గారు మాట్లాడుతూ చిన్న వయసు నుండే విద్యార్థిని విద్యార్థులకు ఎన్నికల పట్ల అవగాహనను కలిగించడం ద్వారా సమాజంలో రేపటి పౌరులుగా తీర్చిదిద్దబడే నేటి విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తులో మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవడం నేర్చుకోవడం జరుగుతుందని తద్వారా సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ భారతదేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కోడి సుష్మ, ప్రిన్సిపాల్ రవికాంత్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News