సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఆ చిన్నోడి ప్రాణం కాపాడుతా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ప్రతిపక్షం మునుగోడు జులై 11: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకొని ఒక నిరుపేద కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. తల్లిదండ్రులు లేక తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక చిన్నారికి తమ ఫౌండేషన్ ద్వారా పూర్తి ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన మనువడిని బతికించావాలంటూ ఒక వృద్ధుడు (తాత) కన్నీరుమున్నీరవుతూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని ఆశ్రయించారు. “నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు.. ఈ మనువడే నాకున్న ఏకైక ఆస్తి. వాడిని ఎలాగైనా కాపాడండి” అని ఆ తాత ఎమ్మెల్యే ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు.

*సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తా

బాధిత వృద్ధుడి ఆవేదన, చిన్నారి పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఆ చిన్నారి ప్రాణాలు కాపాడటానికి ఎంత ఖర్చైనా వెనకాడేది లేదని స్పష్టం చేశారు. తమ ఫౌండేషన్ ద్వారా చిన్నారికి పూర్తి ఉచిత వైద్యం అందించి, అతన్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చే బాధ్యతను తానే తీసుకుంటానని ఆ తాతకు కొండంత భరోసా ఇచ్చారు. ఆపదలో ఉన్న తమను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకు ఆ వృద్ధుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Spread the love

Related News

Latest News