జేఎన్‌టీయూ సుల్తాన్‌పూర్ కళాశాల విద్యార్థులకు అత్యాధునిక రవాణా సౌకర్యం

  • ఇంజనీరింగ్ కళాశాలకు కొత్త బస్సులను ప్రారంభించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రతిపక్షం, సంగారెడ్డి ప్రతినిధి, జూలై 11: చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన నూతన బస్సులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్‌ను కూడా మంత్రి ప్రారంభించి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్యతో పాటు సురక్షితమైన రవాణా సౌకర్యాలు, ఆధునిక మౌలిక వసతులు కల్పించడంఫై ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళాశాలలకు రాకపోకలు సాగించేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు.జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతనంగా రెండు బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మంత్రి తెలిపారు. దీంతో విద్యార్థుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో విద్యార్థుల సమయం వృధా కాకుండా, సమయపాలన మెరు గవుతుందన్నారు. విద్యార్థులకు ఈ బస్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.

అలాగే, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఏర్పాటు చేసిన స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుందని, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది దోహదపడుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విద్యాసంస్థల్లో అవసరమైన అన్ని సదుపాయాలను దశలవారీగా కల్పిస్తోందన్నారు.విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్ వైస్‌ ఛాన్సలర్ డా. కిషన్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ పాండు , కళాశాల ప్రిన్సిపల్ విశ్వనాథరాజు,అందోల్ ఆర్డీఓ రమేష్ బాబు , ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, తాఫితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News