అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యంతో బీజేపీ జిల్లా కమిటీ

  • పార్టీ బలోపేతమే లక్ష్యం – జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్

ప్రతిపక్షం,సిద్దిపేట టౌన్, జులై 11: అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ సిద్దిపేట జిల్లా బీజేపీ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్ తెలిపారు. శనివారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 21 మంది సభ్యులతో జిల్లా కమిటీని రూపొందించినట్లు వెల్లడించారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ కమిటీ కృషి చేస్తుందని చెప్పారు.

కొత్త కమిటీలో ఆరుగురు జిల్లా ఉపాధ్యక్షులతో పాటు జిల్లా ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ట్రెజరర్, మీడియా కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్, ఐటీ సెల్ కన్వీనర్లను నియమించినట్లు తెలిపారు. అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ కమిటీని ఏర్పాటు చేశామని, ప్రతి నాయకుడు తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించి, బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని బైరి శంకర్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ జిల్లాలో బీజేపీని మరింత బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు.

ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బీజేపీ నూతన కమిటీ పదాధికారుల వివరాలను వెల్లడించారు.జిల్లా ఉపాధ్యక్షులు: తేకులపల్లి బాల్‌రెడ్డి, కిష్టమ్మగారి సుభాష్‌రెడ్డి, తోడుపునూరి వెంకటేశం, కొత్తపల్లి వేణుగోపాల్, మాచర్ల కుమారస్వామి గౌడ్, కట్టా భాగ్యలక్ష్మి.జిల్లా ప్రధాన కార్యదర్శులు: నాతి మల్లేష్ ముదిరాజ్, ఖమ్మం వెంకటేశం, బూరెడ్డిగారి విభీషణ్ రెడ్డి.ఈ మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు వెంకట్, నాయకులు తుంగ కనకయ్య, వీరారెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News