ప్రతిపక్షం, జూలై 11: ప్రముఖ గాయని ఎస్. జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో తన మధుర గానంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహా గాయని అని కొనియాడారు. పాత్రలు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను ఆవిష్కరిస్తూ ఆమె ఆలపించిన పాటలు తరతరాల శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. తెలుగు వారు కావడం రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని అన్నారు. తెలుగు, తమిళం, హిందీతో పాటు మొత్తం 17 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడి అనేక జాతీయ పురస్కారాలు అందుకున్న ఆమె మరణం భారతీయ సినీ సంగీత రంగానికి, కోట్లాది అభిమానులకు తీరని లోటని తెలిపారు. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు.

















