ఎం సి హెచ్ హాస్పిటల్లో సమస్యలను వెంటనే పరిష్కరించండి

సిపిఎం ఆధ్వర్యంలో ప్రజావాణి వినతి పత్రం

సిపిఎం నాయకులు మల్లేశం

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 13: మెదక్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని మెదక్ జిల్లా సిపిఎం నాయకులు మల్లేశం తెలిపారు. సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక సమస్యల పై అధ్యయనం లో హాస్పిటల్ పర్యటించడం జరిగిందని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు ముఖ్యంగా మాత శిశు ఆసుపత్రిలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయని దీంతో పేషెంట్లు వద్ద ఉన్న అటెండర్లు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అయినా అన్నారు. సిపియం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు రాష్ట్ర కమిటీ సభ్యులు అడివయ్య మెదక్ జిల్లా కార్యదర్శి కే నర్సమ్మతో పాటు ఒక బృందం ఆసుపత్రిని పరిశీలించడం జరిగింది అందులో ముఖ్యంగా మాతా శిశు ఆసుపత్రిలో మంచినీటి సౌకర్యం కల్పించాలి. పేషంట్లతో వచ్చే సహాయకులకు ఉండటానికి షెడ్డును సక్రమంగా నిర్మించాలని. పేషెంట్లు సహాయకులకు మరుగుదొడ్లు మౌలిక వసతులు కల్పించాలి. స్నానల గదికి దారి సరి చేయాలి. ట్యాప్స్ ఏర్పాటు చేసి శుబ్రంగా ఉంచాలి. ఆస్పత్రి ఆవరణలో పరిశుభ్రంగా ఉండేందుకు కృషి చేయాలి.ఆసుపత్రి పరిధిలో ఉన్న పిచ్చి మొక్కలు గడ్డి చెట్లు తొలగించాలి.. ఆస్పత్రిలో పనిచేసే శానిటేషన్ వర్కర్లకు జీవో 61 ప్రకారం వేతనాలు చెల్లించాలి. ఆస్పత్రి శానిటేషన్కు సరిపడా సిబ్బందిని కేటాయించాలి.ఆస్పత్రి ఆవరణలో సరిపడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలి.
మెయిన్ రోడ్డు దగ్గర నేమ్ బోర్డ్ పెద్దగా పైకి ఉండేటట్లుగా పెట్టాలి.మెయిన్ రోడ్డు నుండి ఆసుపత్రి లోపల వరకు వీధి దీపాలు పెట్టించాలని.లాబ్స్ అన్నీ రకాల టెస్టులు చేయాలి. రిపోర్టులు తక్షణమే అందేలా చర్యలు తీసుకోవాలి ఆయన తెలిపారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ప్రజా ఉద్యమం చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సంతోష్ నరసమ్మ మల్లేశం తదితరులు పాల్గొన్నారు

Spread the love

Related News

Latest News