ట్రంప్ సన్నిహితుడిపై రష్యా విష ప్రయోగం చేసిందా?

ప్రతిపక్షం, జూలై 13: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితుడిగా భావించే అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పలు ప్రచారాలు వైరల్ అవుతున్నాయి. ఆయనపై రష్యా విషప్రయోగం చేసిందని, మరణించారని కొన్ని వర్గాలు చేస్తున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ ప్రచారాలకు సంబంధించి అమెరికా ప్రభుత్వం, సెనెటర్ లిండ్సే గ్రాహమ్ కార్యాలయం లేదా ఇతర అధికారిక వర్గాల నుంచి ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. ఆయన మరణించారనే వార్తలను నిర్ధారించే అధికారిక సమాచారం కూడా అందుబాటులో లేదు.

ఇదిలా ఉండగా, ఇటీవల ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా లిండ్సే గ్రాహమ్ సందర్శించిన డ్రోన్ తయారీ కేంద్రంపై రష్యా దాడి జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటన అనంతరం సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చినట్లు తెలుస్తోంది.

కాగా, గతంలో రష్యాపై కఠిన వైఖరి అవలంబిస్తూ, రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై భారీ సుంకాలు విధించాలని లిండ్సే గ్రాహమ్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

Spread the love

Related News

Latest News