మెదక్ జిల్లాలో 55 శాతం సర్ నమోదు: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 14: మెదక్ మున్సిపాలిటీ లోని వార్డ్ నెంబర్ 11 లో సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్,ఆర్డీవో , తాహాసిల్దార్ మున్సిపల్ కమిషనర్ ,వార్డ్ కౌన్సిలర్ తో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సర్ మోదుకు ఈనెల 24న చివరి తేదీ ఉందన్నారు. మెదక్ లో 53% సర్ ప్రక్రియ నమోదయిందని,4,55000 మంది ఓట్లు కలిగిన మెదక్ జిల్లాలో 55 శాతం సర్ నమోదు శాతాన్ని పూర్తి చేశామన్నారు.సర్ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాలు అందజేయడంతో పాటు వాటిని పూర్తి చేయించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అవసరమైన చోట రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ సిబ్బందితో పాటు ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ఏజంట్లును సమన్వయం చేసుకుంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా వీడియోలు, సందేశాలు పంపించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో అన్ని మండలాలు, మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక ఎస్‌ఐఆర్ శిబిరాలు నిర్వహించాలని ఆదేశించిన కలెక్టర్, ఈ నెల 24 వ తేదీలోపు నమోదు ప్రక్రియను నూరు శాతం పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి, తాహాసిల్దార్ లక్ష్మణ బాబు, మున్సిపల్ కమిషనర్ నవీన్ , స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News