ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ

  • రూ.2 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్ /పెద్దపల్లి, జూలై 14: పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ డీఎస్పీ జి. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కినట్లు అధికారులు తెలిపారు.ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం, మున్సిపల్ పరిధిలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు చేసే విషయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు సతీష్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఈ ఆపరేషన్ ఏసీబీ డీఎస్పీ జి. మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News