ప్రతిపక్షం, జూన్ 03: విశాఖ జిల్లాలోని ఆనందపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయనకు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పండు తన బృందంతో కలిసి తగరపువలసలో జరిగిన జాతరకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపారు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం వారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

















