దక్షిణాఫ్రికా పెట్టుబడులకు తెలంగాణలో పూర్తి సహకారం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 03: తెలంగాణను పెట్టుబడులకు అత్యంత అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందంతో జరిగిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక, పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

సమాచార సాంకేతికత, తయారీ, మౌలిక సదుపాయాలు, ఫార్మా, వ్యవసాయం వంటి రంగాల్లో సహకార అవకాశాలపై ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, వేగవంతమైన అనుమతులు అందిస్తోందని సీఎం వివరించారు.

దక్షిణాఫ్రికా కంపెనీలు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఇరు ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సహకారం మరింత పెరగాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.

Spread the love

Related News

Latest News