ప్రతిపక్షం, జూలై 14: తెలంగాణలో అవినీతి అధికారులపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బచ్చు రవీందర్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. కేజీ బంగారం, కేజీ వెండి, రూ.4 లక్షల నగదు, విదేశీ మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అలాగే కొండాపూర్‌లో రెండు ప్లాట్లు, మసీద్‌బండలో నాలుగు అంతస్తుల భవనం, శంషాబాద్, షాబాద్ ప్రాంతాల్లో నాలుగు ఎకరాల భూమి, జడ్చర్లలో ఏడు ప్లాట్లు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.50 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తుండగా, దర్యాప్తు కొనసాగుతోంది.


















