ప్రతిపక్షం, జూలై 14: అయోధ్య రామాలయానికి సంబంధించిన బంగారం, విరాళాల వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వీ. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా ఈ నెల 23న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మౌన దీక్ష చేపడతానని ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణపై తమకు నమ్మకం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాలని కోరారు. వీహెచ్ చేపట్టనున్న దీక్షకు ఏఐసీసీ అగ్రనేతల మద్దతు ఉంటుందని తెలిపారు.


















